Unknown Unknown Author
Title: నడుమునొప్పి వేధిస్తుంటే ఏం చేయాలి | Home Remedies to control Backpain
Author: Unknown
Rating 5 of 5 Des:
నడుమునొప్పి వేధిస్తుంటే ఏం చేయాలి | How to get rid of Back pain ఈ మధ్య అందరినీ తరచుగా వేధిస్తున్న సమస్య నడుంనొప్పి. కంప్యూటర్ల ముందు ...
నడుమునొప్పి వేధిస్తుంటే ఏం చేయాలి | How to get rid of Back pain
ఈ మధ్య అందరినీ తరచుగా వేధిస్తున్న సమస్య నడుంనొప్పి. కంప్యూటర్ల ముందు కూర్చుని గంటలు గంటలు పనిచేయడం, వాహనాల మీద ఎక్కువ దూరాలు ప్రయాణించాల్సి రావడం వంటి వాటివల్ల ఈ సమస్య రోజురోజుకూ అధికమవుతోంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
  • సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలి.
  • వాహనం నడిపేటప్పుడు, కుర్చీలో కూర్చున్నప్పుడు నడుము నిటారుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే బరువులు లేపకూడదు.
  • బల్లమీద కానీ, నేలమీద కానీ పడుకోవాలి. అసంబద్ధమైన భంగిమల్లో కూర్చోకూడదు.
  • నడుమును అకస్మాత్తుగా తిప్పడం, వంచడం చేయకూడదు. 
  • పౌష్టికాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం, ప్రాణాయామం, యోగా వంటివి చేయాలి.
  • వెంటనే బరువు చెక్ చేసుకుని, ఎక్కువ ఉంటే కనుక తగ్గే ప్రయత్నం చేయాలి. 
  • పాదరక్షలు కూడా నడుమునొప్పికి కారణమవుతాయి. కాబట్టి ఎత్తుమడమల చెప్పులు మానేసి ఫ్లాట్‌గా, సౌకర్యంగా ఉండే చెప్పులు ధరించాలి.

Advertisement

Post a Comment

 
Top