తులసి ఎందుకు పూజనీయమైంది | ధర్మ సందేహాలు
భారతావనిలో ప్రతి ధార్మిక గృహంలోనూ విధిగా తులసి ఆరాధన ఉంటుంది. మన ధార్మిక, పౌరాణికగ్రంథాలలో తులసి వైశిష్ట్యాన్ని వివరించారు. తులసీ వనం విరజిల్లే గృహం తీర్థంతో సమానమని, అక్కడకు యమదూతలు రాలేరని శాస్త్రోక్తి. ఆరోగ్య రీత్యా తులసిలో రోగ నిరోధక, రోగ నాశక తత్త్వం అధికంగా ఉంటుంది. ఎక్కిళ్లు, ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధులు, విషానికి విరుగుడు వంటి ఔషధ గుణాలు తులసికి ఉన్నట్లు చరక సంహిత చెబుతోంది. ఇన్ని కారణాలుండటం వల్లనే తులసి పూజనీయమైంది.
Post a Comment