నిత్యకృత్యాలు | మనం ఆచరించాల్సిన రోజు వారి విధానాలు | ధర్మ సందేహాలు
- పురుషులు నిలబడి మూత్రము పోయరాదు, పోసిన దరిద్రము, నపుంసకత్వం కలుగును. స్త్రీలు నిలబడి మూత్రము పోసిన నరముల బలహీనత, దరిద్రము, భర్త వియోగము కలుగును.
- రాత్రిపూట పెరుగుతో తినరాదు ఆయుష్షు క్షీణం. పగలు పెరుగు, రాత్రి పాలు వాడిన జ్ఞానవృద్ధి, వీర్యవృద్ధి కలుగును.
- భోజనానికి ముందు అరటిపండు, దోసపండు తినరాదు.
- చల్లబడిన ఆహారపదార్ధాలను మరల వేడిచేసి తినుట విషతుల్యము.
- ఉదయాన్నే నిద్రలేచిన పిదప రాగి పాత్రలోని నీటిని త్రాగితే (రాత్రి రాగిపాత్రలో పోసి ఉంచాలి) ఆయుర్దాయము, ఆరోగ్యము, యవ్వనము కలిగించును.
- పడమట (లేక) ఉత్తరంగా (లేక) ఈశాన్యంగా కూర్చొని దంతధావనం చెయ్యాలి. నిలబడి చెయ్యకూడదు.
- భోజనము చేయునపుడు పాదములను, పొట్టను తాకుట, నిమురుట చేయరాదు. డబ్బు నిలవదు.
- మొకాల్లకులోన చేతులుంచి భోజనం చేసిన కీర్తి, అభివృద్ధి కలుగును.
- ఉదయాన నిద్ర లేచేటప్పుడు కుడి వైపుకి తిరిగి లేవవలెను. నిద్ర లేవ గానే అర చేతిని చూచు కొనవలెను. తరువాత ఏ దేవుని స్తోత్ర మైన జపించాలి. పక్క దిగే ముందు చేతి తో నేలను తాకి, భూమాతను క్షమించ మని అడగాలి.
- వేపపుల్ల, జామాయిల్ పుల్లలతో పళ్ళు తోమరాదు.
- చేతి, కాలి గోళ్ళు సోమవారం, బుధవారం, గురువారం రోజున తీసుకోవాలి. ఫలం: లాభం, మనస్సాంతి, ఆరోగ్యం, గౌరవం కలుగును. మంగళవారం, ఆదివారం, శుక్రవారం, శనివారం రోజులలో గోళ్ళు తీసుకొనరాదు. ఫలం: ధన వ్యయం, కలహములు, చిక్కులు, కష్టాలు, వ్యాధి, దుర్వార్తా శ్రవణం మొదలగునవి జరుగును.
- సూర్యునికి ఎదురుగా నిలబడి మూత్ర, మల విసర్జన చేయరాదు.
- నిత్యం చల్లని నీటితోనే స్నానం చెయ్యాలి. వేడి నీటితో గాని, ఇతరులకు సంబంధించిన నీటితో గాని స్నానం చేసిన అదృష్టం కలసిరాదు.
- తూర్పు, దక్షిణం దిశగా తల ఉంచి పడుకోవాలి. పడమట, ఉత్తరము వైపు తల ఉంచి నిద్రించరాదు. నిద్రించునపుడు దుప్పటిని తలపైగా కప్పుకొనరాదు. చాతిపై చేతులుంచి, వెల్లికిలా పడుకొనరాదు.
- మధ్యాహ్నం నిద్రించరాదు.
- మీరు ఇంటి నుండి బైటకు పోయేటపుడు ,లోనికి వచ్చేటపుడు విధిగా కాళ్ళు కడగటం అలవర్చుకోండి.
Post a Comment