రాహు గ్రహానికి శాంతులు | ధర్మ సందేహాలు
- పద్దెనిమిది వేలు జపం + పద్దెనిమిది వందలు క్షీరతర్పణం + నూట ఎనభై హోమం + పద్దెనిమిది మందికి అన్నదానం చేసేది.
- శ్రీ కాళహస్తి వెళ్లి రాహు దోష నివారణార్ధం సర్ప దోష పరిహారపూజను జరిపించాలి.
- సుబ్రహ్మణ్య ఆలయాలు దర్శించాలి.
- మూడు శని వారాలు ఏదైనా ఆలయంలో దేవునికి పెరుగు అన్నం (ధద్హోజనం) నివేదన చేసి, పేదలకు దానంగా పంచిపెట్టేది.
- దేవి సప్తశతి పారాయణ (లేక) మంత్రం, దేవి కవచం రోజూ పటించాలి.
- ప్రతి శని వారం ఒక పలావు పొట్లం ఒక విధవ స్త్రీకి దానం చెయ్యాలి. తయారు చేయించి లేకుంటే కొని కూడా ఇవ్వవచ్చు.
- శని వారం రోజు ప్రారంభించి వరుసగా పద్దెనిమిది రోజులు పారుతున్న నీటిలో రోజుకో కొబ్బరి కాయ వేయడం వల్ల రాహు గ్రహ దోషం తగ్గిపోవును.
- కొద్ది పాటి బొగ్గులని నీట్లోకి ధార పోయటం వల్ల రాహు గ్రహ దోషం పోతుంది.
- పడక గదిలో (నిద్రించే గది) నెమలి పించాన్ని కనపడేటట్లు పెట్టి, లేవగానే చూడటం వల్ల రాహు గ్రహ పీడ నెమ్మదిగా నివారణ అవుతుంది.
- ఆదివారం రోజున మినప వడలు కాని, మినప ఉండలు కాని పేదలకు, సాధువులకు పంచండి.
Post a Comment