చంద్ర గ్రహ దోషానికి శాంతులు | ధర్మ సందేహాలు
- చంద్రునికి పది వేలు జపం + వేయి క్షీరతర్పణం + వంద హోమం + పది మందికి అన్నదానం చేయాలి.
- సోమవారం రోజున పేదలకు, సాధువులకు, ముష్టి వాళ్లకు అన్నదానం చేయుట (లేక) దద్దోజనం పంచి పెట్టాలి.
- పది సోమవారాలు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి, కిలో బియ్యం బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి.
- సోమవారం రోజుల్లో గౌరీ, పార్వతి, కనకదుర్గ అమ్మవార్ల దేవాలయాలు దర్శించండి.
- బియ్యపు పిండిని చీమలకు ఆహారంగా వెయ్యాలి.
- బియ్యం, అరటిపండు, కొంచెం కళ్ళు ఉప్పు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టవచ్చు. గమనిక: ఏరోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆరోజు ఆ ఆహారం తీసుకోరాదు.
- రోజు రాత్రి పూట పడుకొనేముందు వెండిగ్లాస్ తో పాలు త్రాగి పడుకొనవలెను.
- పది మాస శివ రాత్రులు శివునకు పాలాభిషేకం చేసి, తీర్థం స్వీకరించండి.
Post a Comment