వాస్తు విషయాలు | ధర్మ సందేహాలు
- ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫోటోలు అమర్చరాదు. దేవుళ్ళ ఫోటోలను అమర్చాలి. వీలుంటే వినాయకుని ఫోటో అమర్చాలి.
- ఇంటి గోడలు కట్టేట్టపుడు తాపీ మేస్త్రీలు, పై పనులు చేయటం కోసం సపోర్టు కర్రలు వేసే సమయంలో గోడలకు కన్నాలు వేస్తువుంటారు. వాటిని అవసరం తీరగానే ఆకన్నాలు మూసెయ్యాలి.
- వాయువ్యం పెరిగిన, మూతపడిన ఇంకేమైన వాయువ్య దోషాలు ఉన్న, వాయువ్యంలో వాయు పుత్రుడైన హనుమంతుని ఉంచి పూజించిన ఆ దోషాల తీవ్రత తగ్గును.
- తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పడమర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం ఈ నాలుగు వైపులా వీధి పోట్లు మంచిది. తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం, పడమర నైరుతి, దక్షిణ నైరుతి వీధి పోట్లు మంచివి కావు దోషపూరితం.
- బీరువాలు నైరుతి యందుంచి, ఉత్తరమునకు తెరుచునట్లు ఉంచాలి.
- తూర్పు మరియు ఉత్తర ప్రహరి గోడలపై పూల చెట్లను పెంచరాదు.
- మూడు పసుపు కొమ్ములు, పసుపు దారంతో షాపు గుమ్మానికి వ్రేలాడదీయండి. దృష్టి దోషం పోతుంది మరియు వ్యాపారాభివృద్ధి ఉంటుంది.
- పడమట వైపు స్థలం కొనుక్కొన్న, భార్యకు అనారోగ్యం, నష్టం కలుగును.
- ఈశాన్యంలో బరువు ఉంచరాదు. పడమర వైపు, దక్షిణం వైపు బరువులు ఉంచవచ్చును.
- దేవాలయాల నీడ, ధ్వజ స్థంభం నీడ పడే స్థలంలో ఇల్లు నిర్మించరాదు. ఉండరాదు.
- పాముల పుట్ట ఉన్న స్థలం కొనరాదు. కొని పుట్ట తవ్వి తీసుకోవచ్చు అనుకొంటే, ఆ కుటుంభానికి తరతరాలుగా నాగ దోషం పట్టుకొంటుంది. దాని వలన సంతాన నష్టం జరగటం, కుంటి, గుడ్డి, మూగ, చెముడు పిల్లలు జన్మించుట, ఆ పిల్లలు ఆకాలంలో మరణించుటం జరుగుతుంది.
Post a Comment