వెండి దీపాలతో ఆరాదించడం వలన కలిగే ఫలితాలు | ధర్మ సందేహాలు
వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే వారికి, వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. గణపతిని, లక్ష్మీనారాయణ స్వామికి, లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజరాజేశ్వరీ అమ్మవారికి, శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తే వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి. ఇవేకాకుండా వివిధ గ్రహాదిదేవతలు, దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు.
- శ్రీ మహాగణపతి - అడ్డంకులు తొలిగి పనులు సకాలంలో పూర్తవుతాయి
- సూర్యుడు - శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది
- చంద్రుడు - తేజోవంతులు, కాంతివంతులు కాగలరు
- కుజుడు - రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది
- బుధుడు - బుద్ధివంతులు కాగలరు
- గురుడు - ఉదర సంబంధ రోగాలు తగ్గుతాయి
- శుక్రుడు - మధుమేహ వ్యాధి తగ్గుతుంది
- శని - కష్టాలు, గుప్తరోగాలు తగ్గిపోతాయి
- రాహువు - సంపదలు కలుగుతాయి
- కేతువు - మంత్రసిద్ధి కలుగుతుంది
- శ్రీ సరస్వతి - జ్ఞానశక్తిని పొందుతారు
- మహాలక్ష్మీ - దారిద్య్రం తొలిగి, ఐశ్వర్యం కలుగుతుంది
- దుర్గాదేవి - శతృ కష్టాలు తొలగిపోగలవు
- గంగాదేవి - పాపాలు తొలగిపోగలవు
- తులసీదేవి - సౌభాగ్యాలు కలుగును
- శివపార్వతులు - దాంపత్యజీవిత సుఖం
- లక్ష్మీనారాయణులు - జీవన్ముక్తి కలుగును
- మృత్యుంజయుడు - అకాల మృత్యు నివారణ అవుతుంది
- శ్రీరాముడు - సోదరుల సఖ్యత కలుగుతుంది
- భైరవుడు - మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుంది
ద్వాదశ రాశులవారు వెలిగించాల్సిన వత్తులు:
- మేషరాశి - త్రివత్తులు (3)
- వృషభరాశి - చతుర్‌వత్తులు (4)
- మిధునరాశి - సప్తవత్తులు (7)
- కర్కాటకరాశి - త్రివత్తులు (3)
- సింహరాశి - పంచమవత్తులు (5)
- కన్యరాశి - చతుర్‌వత్తులు (4)
- తులారాశి - షణ్ముఖ వత్తులు (6)
- వృశ్చికరాశి - పంచమవత్తులు (5)
- ధనుస్సురాశి - త్రివత్తులు (3)
- మకరరాశి - సప్తమవత్తులు (7)
- కుంభరాశి - చతుర్‌వత్తులు (4)
- మీనరాశి - పంచమవత్తులు (5)
జన్మ లగ్న రీత్యా వెలగించాల్సిన వత్తులు:
- మేష లగ్నం - పంచవత్తులు (5)
- వృషభ లగ్నం - సప్తమవత్తులు (7)
- మిధున లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
- కర్కాటక లగ్నం - పంచమవత్తులు (5)
- సింహ లగ్నం - త్రివత్తులు (3)
- కన్యా లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
- తులా లగ్నం - సప్తమ వత్తులు (7)
- వృశ్చిక లగ్నం - ద్వివత్తులు (2)
- ధనుర్ లగ్నం - పంచమవత్తులు (5)
- మకర లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
- కుంభ లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
- మీన లగ్నం - ద్వివత్తులు (2)
Post a Comment