పంచాంగ శ్రవణం వలన కలిగే ఫలితాలు | ధర్మ సందేహాలు
ఉగాది పర్వదినాన ప్రారంభమయ్యే తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా పంచాంగశ్రవణం చేస్తారు. పంచాంగశ్రవణం సాధారణంగా దేవాలయాలలో కానీ, మరే ప్రాంగణాలలో కానీ ఏర్పాటు చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణమూలానే ఐదు అంగాలను వివిరించేదే పంచాంగం. పంచాంగశ్రవణ సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. పంచాంగకర్త నవనాయకులు, ఉపనాయకులు, వారికి ఆధిపత్యం వహించే గ్రహాలూ, వాటిద్వారా సంవత్సరంలో కలిగే ఫలితాలతో పాటు సంక్రాంతి పురుషుడి లక్షణాలు ఫలాలు, వివిధ నక్షత్రాలు, రాశులవారి రాశిఫలాలు, ఆదాయ, వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు, సవివరంగా తెలియజేస్తారు. దీనివల్ల ప్రతి మానవుడు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు, తొందరపాటు చర్యలకు పాల్పడకుండా వుండేలా జాగ్రత్త పడతాడు.
పంచాంగశ్రవణం చేసే సమయంలో "పంచాంగాలను" స్మరించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
తిథి సంపదలను ప్రసాదిస్తుంది.
వారం ఆయుష్షును పెంపొందిస్తుంది.
నక్షత్రం పాపాలను తొలగిస్తుంది.
యోగం వ్యాధులను పోగొడుతుంది.
కరణం కార్యసిద్ధి కలుగ చేస్తుంది.
పంచాంగ శ్రవణం చేసినవారికి, విన్నవారికి కలిగే ప్రయోజనాలు
సూర్యుడివల్ల శౌర్యము, తేజస్సు
చంద్రునివల్ల వైభవం
అంగారకునివల్ల సర్వమంగళములు
బుధునివల్ల బుద్ధి వికాసము
గురునివల్ల గురుకృప, జ్ఞానము
శుక్రునివల్ల సుఖములు
శనివల్ల దుఃఖరాహిత్యము
రాహువువల్ల బాహుబలము
కేతువువల్ల కులవృద్ధి కలుగుతాయి.
Post a Comment