శుక్ర గ్రహానికి శాంతులు | ధర్మ సందేహాలు
- శుక్రునికి ఇరవై వేలు జపం + రెండు వేలు క్షీర తర్పణం + రెండొందలు హోమం + ఇరవై మందికి అన్నదానం చేసేది.
- శుక్ర గ్రహ దోష నివారణార్థం శ్రీ లక్ష్మి దేవి, పరసు రాముడు ఆలయాలను సందర్శించాలి.
- శుక్ర వారం రోజు అలసందులు, అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఏ ధాన్యం ఆహారంగా పెడుతామో ఆ ధాన్యం మనం తినరాదు.
- పాలతో చక్కెర పొంగలిని చేసుకొని, ధునిలో వేయవలెను.
- శ్రీ రాజ రాజేశ్వరి దేవి అష్టకాన్ని(లేదా) రాజ రాజేశ్వరి దేవి స్తవాన్ని రోజూ పటించాలి.
- మల్లె పూల మాలను లక్ష్మి దేవికి అలంకరించాలి.
- చీమలకు పంచదార (చక్కెర) ఆహారంగా వేస్తూ ఉండాలి.
- దీపావళి పర్వ దినాన లక్ష్మి అష్టకము (లేక) కనకధారా స్తోత్రం ఎనిమిది మార్లు పారాయణ చెయ్యాలి.
Post a Comment