Unknown Unknown Author
Title: Health Benefits of Aloe vera
Author: Unknown
Rating 5 of 5 Des:
Health Benefits of Aloe vera | కలబంద రసం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు: కలబంద రసం తాగడం వలన కలిగే ప్రయోజానాలు అందరికి తెలిసిందే. ...
Health Benefits of Aloe vera | కలబంద రసం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు:

కలబంద రసం తాగడం వలన కలిగే ప్రయోజానాలు అందరికి తెలిసిందే. మన శరీరం అస్వస్తతకు గురైనపుడు నయం చెయటానికి కావాల్సిన పోషకాలు అన్ని కలబంద రసంలో ఉంటాయి. అంతేకాకుండా చాలా రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిలో కొన్ని ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

కలబంద రసం జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణాశయ సమస్యలు కలిగి ఉన్న వారు కలబంద రసం తీసుకోవటం వలన ప్రోటీన్ గ్రహించే ప్రక్రియ అధికమయి, పేగు కదలికలు కూడా మెరుగుపడతాయి. జీర్ణ సమస్యలను తగ్గించటమే కాకుండా గుండెమంటలను కూడా తగ్గించుతుంది.

కలబంద రసం యాంటీ-ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన శరీరంలో చేరే హానికర కారకాలకు వ్యతిరేఖంగా పోరాడుతుంది. క్రమంగా కలబంద రసం తాగటం వలన మీ శరీరంలో చేరిన ఫ్రీ-రాడికల్'లకు వ్యతిరేఖంగా పోరాడటమే కాకుండా, శరీర రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి.

కలబంద రసంలో రక్త పీడనాన్ని నియంత్రించే కారకాలు ఉండటం వలన, రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం పెరుగుతుంది మరియు శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

కలబంద రసం, కొల్లాజన్ మరియు ఎలాస్టిన్'లను మరమ్మత్తు చేసి చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా, చర్మంపై ఏర్పడిన తెగుల్లను, దురదలను మరియు మంటలను తగ్గించుతుంది.

ప్రతి రోజు కలబంద రసం తాగడం వలన బరువు నియంత్రణలో వుండి మన శక్తి స్థాయిలను పెంచుతుంది.

ప్రతి రోజు కలబంద రసం తాగడం వలన చిగుళ్ళు మరియు నోటిలో కలిగే సమస్యలను కూడా తగ్గిస్తుంది. కలబంద రసం ను మౌత్ వాష్ గా కూడా తీసుకోవచ్చు. దంతక్షయాన్ని దూరం చేస్తుంది.

ప్రతి రోజు కలబంద రసం తాగడం వలన మన శరీరానికి కావలసిన ఏడు రకాల అమైనో ఆసిడ్'లు కలబంద రసం నుండి పొందవచ్చు.

కలబంద గుజ్జులో తగినంత పసుపును జోడించి ముఖానికి ఫేషియల్ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుందట.

జుత్తు సంరక్షణ విషయంలోనూ కలబంద కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి ఓ గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు పెరగటమే కాకుండా నిఘారింపును సంతరించుకుంటుంది. కలబంద చుండ్రును దరికి చేరకుండా చేస్తుంది.

అరికాలి పగుళ్లను కలబంద మటుమాయం చేస్తుంది. కలబందలో బి12, సి, ఇ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. చర్మ సంబంధిత సమస్యలకు చక్కటి నివారిణిగా పని చేస్తుంది. కళ్లు మంటలను కలబంద నివారిస్తుంది. నీరు అంతగా అవసరంలేని ఈ చిన్న మొక్క ఇంటికి కొత్త శోభను తెస్తుంది.

Aloe vera, a green herbal plant has been known for its amazing natural healing properties for centuaries; it is also called as “The First aid plant”. For more than three thousand five hundred years people have recognized the healing properties of the Aloe vera plant. 

The use of aloe vera has been documented throughout the history most notably aloe vera use can be traced back to the ancient Egyptians, when the glamorous Cleopatra considered the aloe plant for her personal skin care and beauty secret. It contains 75 known nutrients which include Vitamins, Minerals, Amino acids, Enzymes, Hormones, Lignin and Saponins. 

Due to its enriched and soothing properties, it works great on skin diseases like Eczema, Acne, Sun burn, Dry skin, oily skin etc.

Advertisement

Next
Newer Post
Previous
This is the last post.

Post a Comment

 
Top