తూర్పుదిక్కుకు ప్రాధాన్యం ఎందుకు | ధర్మ సందేహాలు
దేవతలకు రాజు ఇంద్రుడు. ఆయన ఆధిపత్యం వహించేది తూర్పు దిక్కుకి కాబట్టి దేవతల అనుగ్రహం లభించాలంటే తూర్పు దిశకు ముఖాన్ని ఉంచడం మంచిదంటారు. ఇక సైన్స్ పరంగా చూస్తే భూమికి ఉండే ఆకర్షణ శక్తి ఉత్తర దక్షిణాలుగా ఉంటుంది. ఆ శక్తి మనల్ని అధిగమించకుండా ఉండాలి అంటే మనలో సానుకూల భావనలు కలగాలంటే తూర్పు దిక్కుగా తలని ఉంచడం మంచిదన్న మాట! పైగా సమస్త జీవ జాలానికి ప్రాణాధారమైన సూర్యుడు ఉదయించేదీ తూర్పుదిక్కుగానే కదా! అందుకే ఏ పని ప్రారంభించాలన్నా తూర్పు దిశగా తిరిగి చేయడం సంప్రదాయం.
Post a Comment