గురు గ్రహానికి శాంతులు | ధర్మ సందేహాలు
- గురువుకి పదహారువేలు జపం + పదహారు వందలు క్షీరతర్పణం + నూట అరవై హోమం + పదహారు మందికి అన్నదానం చేయాలి.
- గురు వారం రోజున శనగ గుగ్గిళ్ళు పేదలకు పంచవచ్చు.
- గురువులకు సంబంధించిన గ్రంధములు నలుభై ఒక రోజులు పారాయణ చెయ్యాలి. అనగా సాయి బాబా, దత్తాత్రేయ, వెంకయ్య స్వామి మొదలగు వారి చరిత్ర.
- ప్రతి గురు వారం శివాలయాలు గాని, సాయి మందిరాలు గాని, దత్తాత్రేయ మందిరాలు గాని దర్శించి పూజలు జరిపించ వచ్చును.
- గురు వారం రోజు శనగలు, అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్ట వచ్చు. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ రోజు ఆ ఆహారం తినరాదు.
- తేనెను ధునిలో వేస్తూ, పదకొండు సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి.
- బాదం కాయ, శనగ నూనె, కొబ్బరికాయలను పారుతున్న నీటిలో వేయవచ్చు.
Post a Comment