Unknown Unknown Author
Title: బుధ గ్రహ దోషానికి శాంతులు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
బుధ గ్రహ దోషానికి శాంతులు | ధర్మ సందేహాలు బుధునికి పదిహేడువేలు జపం+పదిహేడు వందల క్షీరతర్పణం+నూట డెభై హోమం+పదిహేడు మందికి అన్నదానం చ...
బుధ గ్రహ దోషానికి శాంతులు | ధర్మ సందేహాలు
  1. బుధునికి పదిహేడువేలు జపం+పదిహేడు వందల క్షీరతర్పణం+నూట డెభై హోమం+పదిహేడు మందికి అన్నదానం చేయాలి.
  2. బుధ వారం రోజున పెసర పప్పు పొంగలి, పచ్చని అరటి పళ్ళు పేదలకు దానం చెయ్యాలి.
  3. బుధ వారం రోజున విష్ణు మూర్తి ఆలయాలను దర్శించవచ్చు.(ఉదా: రాముడు,కృష్ణుడు,రంగనాధ స్వామి,నరసింహ స్వామి ఆలయాలు.)
  4. పెసలు,అరటిపండు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకు ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ధాన్యం మీరు తినరాదు.
  5. ఒక రాగి ముక్కకి పెద్ద రంద్రం చేసి, దానిని పారుతున్న నీటిలో వేయవలెను.
  6. బుధ గ్రహం బాగాలేనపుడు నపుమ్సకులకు (కొజ్జాలు) లేదు అనకుండా ధర్మం చెయ్యాలి.
  7. తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ స్తోత్రం ఐదు మార్లు పారాయణ చేయగలరు.
  8. బుధ వారం రోజున పురుష సూక్తం(లేదా) విష్ణు సూక్తం (లేదా) నారాయణ సూక్తం పారాయణ చేయాలి.
  9. తులసి మాలను పదిహేడు బుధ వారములు శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకరించండి.

Advertisement

Post a Comment

 
Top