Unknown Unknown Author
Title: శని గ్రహానికి శాంతులు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
శని గ్రహానికి శాంతులు | ధర్మ సందేహాలు శనికి పంతొమ్మిదివేలు జపం + పంతొమ్మిది వందలు క్షీరతర్పణం + నూట తొంభై హోమం + పంతొమ్మిది మందికి ...
శని గ్రహానికి శాంతులు | ధర్మ సందేహాలు
  1. శనికి పంతొమ్మిదివేలు జపం + పంతొమ్మిది వందలు క్షీరతర్పణం + నూట తొంభై హోమం + పంతొమ్మిది మందికి అన్నదానం చేసేది.
  2. శనికి పంతొమ్మిది శని వారాలు తైలాభిషేకం చేయించి, నువ్వులు దానం ఇచ్చేది.
  3. శని వారం రోజున నువ్వు ఉండలు పేదలకు, సాధువులకు పంచేది.
  4. నవ గ్రహాలకు నలుభై ఒక్క రోజులు ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకం చేసి, నువ్వులు దానం ఇచ్చేది.
  5. ప్రతి రోజు మధ్యాహ్నం కాకులకు అన్నం కాని, బెల్లం కలిపిన నల్ల నువ్వులు కాని పెట్టాలి.
  6. అయ్యప్ప స్వామి దీక్ష మండలం రోజులు స్వీకరించాలి.
  7. హనుమంతుని పూజించవచ్చు, ఉపాసన చేయవచ్చు. అనగా ఆంజనేయాష్టకం, హనుమాన్ చాలీసా రోజూ పారాయణ చేయవచ్చు.
  8. శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయించేది.
  9. ప్రవహించే నీటిలో బొగ్గులు, మేకు, నల్ల నువ్వులు, నల్ల గుడ్డ, నువ్వుల నూనె, గుర్రపు నాడ విడవవలెను.
  10. శనివారం రోజున పంతొమ్మిది సంఖ్య వచ్చే విధంగా దానం చెయ్యాలి.
  11. శని సిన్గానాపూర్, తిరునల్లార్, మందపల్లి, నర్సిన్ఘోలె (లేక) మీ ఊరిలొ ఉన్న శని ఆలయాలను శనివారం రోజున దర్శించి, పూజలు చేయించవచ్చు.
  12. శనివారం రోజు నువ్వులు, అరటి పండు ఆవుకి పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ఆహారం మీరు తినరాదు.
  13. ధునిలో నువ్వులను వేస్తూ, ఇరవై ఆరు ప్రదక్షిణలు చేయాలి.
  14. ఎనిమిది రోజుల పాటు వరుసగా ప్రవహించే నీటిలో బొగ్గులు వేసి రావాలి.

Advertisement

Post a Comment

 
Top