Unknown Unknown Author
Title: రావిచెట్టును ఇంట్లో ఎందుకు పెంచకూడదు | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
రావిచెట్టును ఇంట్లో ఎందుకు పెంచకూడదు | ధర్మ సందేహాలు రావిచెట్టు విష్ణు స్వరూపం. శనిదోషాలు పోగొడుతుంది. అందువల్లే ఆలయాల్లో రావిచెట్టు ...
రావిచెట్టును ఇంట్లో ఎందుకు పెంచకూడదు | ధర్మ సందేహాలు
రావిచెట్టు విష్ణు స్వరూపం. శనిదోషాలు పోగొడుతుంది. అందువల్లే ఆలయాల్లో రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అయితే రావిని ఇంట్లో పెంచకూడదని, శనివారం తప్పించి మిగతా రోజుల్లో రావిచెట్టును తాకకూడదని శాస్త్రాలు అనాదిగా చెబుతున్నా, రావిని ఇంట్లో పెంచకూడదనడానికి ఆధ్యాత్మిక కారణాలేవీ లేవు. అయితే సామాజిక కారణాలు మాత్రం ఉన్నాయి. రావిచెట్టు చాలాకాలం ఉంటుంది. పైగా అది పెరిగేకొద్దీ దాని వేళ్లు భూమిలోపల చాలా దూరం బలంగా పాకుతాయి. దానివల్ల పునాదులు దెబ్బతిని ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే రావి చెట్టు భారీ వృక్షంగా పెరుగుతుంది కాబట్టి వాటి మీద పక్షులు గూళ్లు కట్టి, గుడ్లు పెడతాయి. వాటికోసం పాములు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే రావిచెట్టును ఇంట్లో పెంచవద్దని చెబుతారు. నిజానికి రావిచెట్టే కాదు, ఏ పెద్ద చెట్టును పెంచినా ఈ సమస్య వస్తుంది.

Advertisement

Post a Comment

 
Top